పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. విలక్షణ నటన, విభిన్నమైన చిత్రాలతో అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు విశ్వనాయకుడు కమల్ హాసన్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే కమల్ ‘విక్రమ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ భారీ స్పందన దక్కింది. ఫలితంగా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే నాలుగో వారంలోనూ కలెక్షన్లను భారీగా రాబడుతోంది. ఈ నేపథ్యంలో ‘విక్రమ్’ 22 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!
విక్రమ్‌గా కమల్ హాసన్ అరాచకం
కమల్ హాసన్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే ‘విక్రమ్’. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రల్లో కనిపించారు. ఇక, ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు.
శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ ట్రీట్: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో అలా అందాల కనువిందు!
భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘విక్రమ్’ మూవీకి తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల మేర వ్యాపారం అయింది.
22వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
‘విక్రమ్’ మూవీకి తమిళనాడులో మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లోనూ ఆరంభంలో మంచి టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన దక్కింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా అత్యధికంగా వస్తున్నాయి. దీంతో టార్గెట్‌ను చేరుకుని లాభాల బాటలోనూ పయనిస్తోంది. ఈ నేపథ్యంలో 22వ రోజు దీనికి కేవలం రూ. 8 లక్షలే వచ్చాయి.
స్విమ్మింగ్ పూల్‌లో నందినీ రాయ్ అందాల ఆరబోత: వామ్మో మరీ ఇంత హాట్‌గానా!
22 రోజులకూ కలిపి ఎంతొచ్చింది
‘విక్రమ్’ 22 రోజుల్లోనూ ఆంధ్రా, తెలంగాణలో భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 6.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.33 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.22 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 81 లక్షలు, గుంటూరులో రూ. 1.10 కోట్లు, కృష్ణాలో రూ. 1.25 కోట్లు, నెల్లూరులో రూ. 55 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 16.11 కోట్లు షేర్, రూ. 28.15 కోట్లు గ్రాస్ దక్కింది.
ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా
22 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.11 కోట్లు కొల్లగొట్టిన ‘విక్రమ్’ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా 22వ రోజు రూ. 65 లక్షలు షేర్ రాబట్టింది. వీటితో కలిపి 22 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కమల్ సినిమాకు రూ. 184.55 కోట్లు షేర్‌తో పాటు రూ. 375.36 కోట్లు గ్రాస్ వసూలైంది.
డెలివరీ తర్వాత ఊహించని లుక్‌లో ప్రణీత: ఆమెనిలా చూశారంటే షాకే!
బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?
‘విక్రమ్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లకు కొన్నాడు. ఇక, ఈ సినిమాకు 22 రోజుల్లోనే రూ. 184.55 కోట్లు వచ్చాయి. అంటే రూ. 83.50 కోట్లు పైగా లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 16.11 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 8.61 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.
- Hypervitaminosis B: Side Effects of Too Much Vitamin B
- Memes and manipulation
- With hi 85th birthday looming, Willie Nelson shares his secret to longevity
- The 101 Best Parts of a Ride
- Dissecting Microsoft's "100 Reasons You'll Be Speechless"
- Nirmala Sitharaman’s Union Budget for 2019-20: Key Highlights
- Ethanol-infused fuel can cause problems, but don’t expect it to disappear
Vikram 22 Days Collections: విక్రమ్‌కు ఊహించని వసూళ్లు.. తొలిసారి తక్కువగా.. నితిన్‌కు లాభం ఎంతంటే! have 172 words, post on telugu.filmibeat.com at June 25, 2022. This is cached page on Movie News. If you want remove this page, please contact us.