బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తన సహజ సిద్ధమైన నటనతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ నటన, విభిన్నమైన చిత్రాలతో అలరిస్తోన్న అతడు.. తన మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ‘అంటే.. సుందరానికీ!’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో నాని సినిమా 13 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!
పంచె కట్టుకున్న నేచురల్ స్టార్
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రమే ‘అంటే.. సుందరానికీ!’. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ సినిమాలో నరేష్, నదియా తదితరులు కీలక పాత్రలను పోషించారు.
యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ బయట పెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నాడంటూ ఎమోషనల్
నాని మూవీకి ఓ రేంజ్ బిజినెస్
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ‘అంటే.. సుందరానికీ!’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 30 కోట్ల బిజినెస్ చేసుకుంది.
13వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
నేచురల్ స్టార్ నాని – నజ్రియా జంటగా నటించిన ‘అంటే.. సుందరానికీ!’ మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ కూడా ఊహించినట్లుగా వచ్చాయి. అయితే, వీకెండ్ తర్వాత నుంచి క్రమంగా వసూళ్లు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణలో 13వ రోజు ఈ సినిమాకు కేవలం రూ. 11 లక్షలే వచ్చాయి.
ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!
13 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది?
ఏపీ, తెలంగాణలో 13 రోజుల్లో ‘అంటే.. సుందరానికీ!’ కలెక్షన్లు ఇలా వచ్చాయి. నైజాంలో రూ. 6.13 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.26 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.69 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.03 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 94 లక్షలు, కృష్ణాలో రూ. 96 లక్షలు, నెల్లూరులో రూ. 61 లక్షలతో.. రూ. 13.46 కోట్లు షేర్, రూ. 22.75 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
13 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 13.46 కోట్లు వసూలు చేసిన ‘అంటే.. సుందరానికీ!’ మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.65 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 13 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 20.71 కోట్లు షేర్‌తో పాటు రూ. 36.70 కోట్లు గ్రాస్ వచ్చింది.
పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు: ఆకాశ్ నీ కొడుకు కాదా.. చాలా మంది ఉన్నారంటూ!
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
‘అంటే.. సుందరానికీ!’ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 31 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లో దీనికి రూ. 20.71 కోట్లు వచ్చాయి. అంటే మరో 10.29 కోట్లు రాబడితేనే ఇది హిట్ అవుతుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కోట్లు వచ్చే అవకాశం లేదనే చెప్పాలి.
- National Museum of Scotland’s £80 million, 15-year refurbishment fully realised today
- B1 Estonian exam, Part 3: Certificate and conclusion
- Ronaldo nets only goal as Juventus win Italian Supercoppa at Milan's expense
- Transfer tests results: Breakdown of Year 8 intake in Northern Ireland selective grammar schools (2018)
- Modern immigration to the United Kingdom
- Market prices – week 8
- Here are some of the celebrities we have lost in the last 12 months
- Moodyʼs upgrades Takarék Mortgage Bankʼs ratings, outlook
- The year in celebrities: 2018 brought three Kardashians, outsized weddings, and mourning
- Top 100 Russian and Soviet movies
- John Lowe: '100 ways to save cash'
Ante Sundaraniki Collections: నానికి భారీ దెబ్బ.. తొలిసారి ఇంత తక్కువ.. ఇంకెన్ని కోట్లు రావాలంటే! have 212 words, post on telugu.filmibeat.com at June 23, 2022. This is cached page on Movie News. If you want remove this page, please contact us.