బ్యూటీఫుల్ కోలీవుడ్ హీరోయిన్ నయనతార ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటుంది. ఏళ్లతరబడి ఒకే తరహా స్టార్ డమ్ తో కొనసాగుతున్న ఈ బ్యూటీ నేటితరం యంగ్ హీరోయిన్స్ కు కూడా అదే తరహా పోటీని ఇస్తోంది. ఇక నయన్ గతకొంత కాలంగా యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి అమ్మడు అర్ధరాత్రి సమయంలో తెలుగు గడ్డపై దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
గత పదేళ్లుగా..
సౌత్ ఇండియన్ లేడి సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకుంటున్న నయనతార విభిన్నమైన సినిమాలతో గత పదేళ్ళుగా ఒకే తరహా డిమాండ్ తో ముందుకు సాగుతోంది. కమర్షియల్ సినిమాలను మాత్రమే కాకుండా డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కే లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా బాగానే చేసింది.
అందరి హీరోలతో..
ఇక నయనతార తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. నేటితరం యంగ్ జనరేషన్ తో కూడా ఆమె రొమాంటిక్ సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. నయనతారతో నటించాలని ప్రస్తుతం అగ్ర సీనియర్ హీరోలు కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు.
ఆ ప్రభావం సినిమాలపై పడకుండా..
ఇక పర్సనల్ లైఫ్ లో ప్రేమ వివాదాలతో ఎన్నోసార్లు చేదు అనుభవాల్ని ఎదుర్కొన్న నయనతార వీలైనంత వరకు ఆ వివాదాలను తన సినిమాలపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇక సినిమా ప్రమోషన్స్ కు కూడా నయన్ దూరంగానే ఉంటుంది. మీడియాలో ఎన్ని రూమర్లు వస్తున్నా కూడా ఏ మాత్రం పట్టించుకోదు. మంచి నటిగా తన పని తాను చేసుకుంటూ ఇష్టమైన జీవితాన్ని కొనసాగిస్తోంది.
ప్రియుడి దర్శకత్వంలో..
ఇక నయనతార ఇటీవల తన ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసింది. ‘కాతు వాకుల్ రెండు కాదల్’ అనే ఆ సినిమా నేడు విడుదలయింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సమంత కూడా నటించారు. ఇక సినిమాకు ఓ వర్గం ప్రేక్షకుల నుంచి మంచి టాక్ అయితే వస్తోంది.
అర్ధరాత్రి తిరుపతిలో..
ఇక ఆ సినిమా సక్సెస్ అవ్వాలని సమంత నయనతార గుళ్ళు గోపురాలు తిరగడం స్టార్ట్ చేశారు. ఇక డైరెక్ట్ గా వాళ్ళు ఆంద్రప్రదేశ్ లోని తిరుపతి వెంకన్న స్వామి దర్శనం కూడా చేసుకున్నారు. అర్ధరాత్రి తిరుపతికి వెళ్లిన నయన్, విగ్నేష్ గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఇక విగ్నేష్ నయన్ తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడ
పెళ్లి ఎప్పుడు?
ఇక నయనతార విగ్నేష్ శివన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు గత ఏడాది నుంచి అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఆ విషయంలో ఈ నటీనటులు మాత్రం పెద్దగా క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక వీరు ప్రస్తుతం వారి కెరీర్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక అప్పుడప్పుడు విదేశాలకు అలాగే ఇలా పుణ్యక్షేత్రాలకు వెళుతూ దంపతుల తరహాలోనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
- Indian firm in Chicago Paid Indian-Level Wages to Cheat U.S. Graduates
- BJP's Giriraj Singh Advises Begusarai Residents To ‘Beat Officials With Sticks If They Don't Listen To Your Grievances'
- COVID-19 Vaccine Tracker: 16 lakh doses administered in India on May 22
- Georgia Loses More than $300 Million in Payroll from H-1Bs Workers.
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తెలుగు గడ్డపై నయనతార.. అర్ధరాత్రి సమయంలో ఇలా.. ఫొటో వైరల్! have 128 words, post on telugu.filmibeat.com at April 28, 2022. This is cached page on Movie News. If you want remove this page, please contact us.