ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న స్పైడర్ మ్యాన్ చిత్రం మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటింది. ఆరువారాల క్రితం రిలీజైన స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. టామ్ హాలెంట్ నటించిన ఈ మార్వెల్ చిత్రం కరోనావైరస్ పరిస్థితుల్లో కూడా రికార్డులు తిరగరాసింది. పలుచోట్ల కర్ప్యూలు, 50 శాతం అక్యుపెన్సీ పరిస్థితుల్లో రికార్డు స్థాయి లాభాలను సాధించింది.
గత ఆరువారాల బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 1.69 బిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. అమెరికా బాక్సాఫీస్ వద్ద 721 మిలియన్ డాలర్లను వసూలు చేయడం రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి.
స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ చిత్రం ఆరోవారాంతంలో కూడా ఉత్తర అమెరికాలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. శుక్రవారం, శనివారం రోజుల్లో 14.1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 27.7 మిలియన్ డాలర్లు రాబట్టింది.
చైనాలో స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ చిత్రం రిలీజ్ కాలేదు. అయినప్పటికీ ఈ చిత్రం రిలీజైన ప్రతీ దేశంలో రికార్డులను తుడిచిపెట్టింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల జాబితా విషయంలోకి వెళితే..
1. అవతార్ చిత్రం 2.8 బిలియన్ డాలర్లు
- Icestorm Tools Roundup: Open Source FPGA Dev Guide
- Learn FPGA with this Persistence of Vision Hack
- FPGA Testbenches Made Easier
Spider Man: No Way Home చరిత్ర సృష్ఠించిన స్పైడర్ మ్యాన్.. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు have 130 words, post on telugu.filmibeat.com at January 24, 2022. This is cached page on Movie News. If you want remove this page, please contact us.