బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. వరుస సినిమాలతో హవాను చూపించాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే ‘పుష్ప’ అనే పాన్ ఇండియా మూవీ చేశాడు.
ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందనను అందుకుని సత్తా చాటింది. ఫలితంగా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ మూవీ 34 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!
'పుష్ప’గా అల్లు అర్జున్ అరాచకం
ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రమే 'పుష్ప’. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్ చేశారు. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇది సూపర్ హిట్ అయింది.
హాట్ డోస్ మరింత పెంచేసిన పూజా హెగ్డే: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు
పుష్ప మూవీ థియేట్రికల్ బిజినెస్
అల్లు అర్జున్‌కు ఆంధ్రా, తెలంగాణతో పాటు చాలా ఏరియాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో 'పుష్ప’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 101.75 కోట్లు, కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 13 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు వరకూ బిజినెస్ జరిగింది.
34వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన 'పుష్ప’కు ఆరంభం నుంచీ భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. అయితే, ఓటీటీలో విడుదలైన తర్వాత తగ్గుతూ వచ్చిన కలెక్షన్లు ఈ మూవీ కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో 34వ రోజు ఏపీ తెలంగాణలో కలిపి కేవలం రూ. 2 లక్షలు మాత్రమే వచ్చాయి.
Bigg Boss OTT: షోలోకి అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ ఎంట్రీ.. రెండోసారి ఆఫర్ పట్టేసిన టాలీవుడ్ హీరో
34 రోజులకు తెలుగు రాష్ట్రాల్లో ఇలా
'పుష్ప’ మూవీకి 34 రోజులకు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు వచ్చాయ
ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
34 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో 'పుష్ప’కు రూ. 85.23 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 11.62 కోట్లు, తమిళనాడులో రూ. 11.45 కోట్లు, కేరళలో రూ. 5.52 కోట్లు, హిందీలో రూ. 42.90 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.22 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 34 రోజుల్లో రూ. 173.44 కోట్లు షేర్‌తో పాటు రూ. 332.60 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.
బ్రేకప్ తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన షణ్ముఖ్: ఆ ప్రేమ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా అంటూ పోస్ట్
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప’ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 34 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 173.44 కోట్లు వసూలు చేసింది. తద్వారా రూ. 27.44 కోట్లు లాభాలను సొంతం చేసుకుని సత్తా చాటింది.
ఓటీటీలో వచ్చినా 30 లక్షలు కొట్టి
పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదలైన 'పుష్ప’ మూవీకి అన్ని చోట్లా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఇది హవాను చూపించింది. జనవరి 14 నుంచి హిందీలోనూ స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. అయినప్పటికీ అక్కడ మాత్రం భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం హిందీ వెర్షన్‌కు ఏకంగా రూ. 20 లక్షల షేర్ రావడం విశేషం.
- Wine stars, real recommendations to winches
- Golf: Yorkshire Inter-District Junior Union
- A-Level: Northern Ireland School League Table 2019
- Golf: Nikki claims Matchplay Final
- GCSE: Northern Ireland School League Table 2019
- Golf: Birtles the winner in Oakdale Ladies Charity Plate
- Local election 2019 results in full: What happened in your ward?
- Costa Blanca Bowls Roundup
- 'We don't have time to wait': Teenagers fight for a greener planet
- Peterborough Magistrates’ Court results
Pushpa 34 Days Collections: ఇక్కడ పుష్పకు భారీ షాక్.. అక్కడ బాక్సాఫీస్ షేక్.. అన్ని లక్షలతో రచ్చ have 176 words, post on telugu.filmibeat.com at January 20, 2022. This is cached page on Movie News. If you want remove this page, please contact us.