బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు తమకు కలిగిన సంతానం గురించి తమ అభిమానులకు శుభవార్తను అందించారు. అయితే గర్భం దాల్చినట్టు కనిపించని ప్రియాంక చోప్రా చెప్పపెట్టకుండా తమకు బిడ్డ పుట్టారని చెప్పడంతో అభిమానులు ఆలోచనల్లో పడ్డారు. అయితే సరోగసి పద్దతి ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిపారు. అయితే ప్రియాంక దంపతులకు జన్మినిచ్చిన బిడ్డ నెలలు పూర్తి కాకుండానే పుట్టినట్టు వెల్లడించడం షాకింగ్‌గా మారింది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ప్రియాంక ఫ్యామిలీని కరుణించి సంతాన లక్ష్మి
ప్రియాంక చోప్రా ఫ్యామిలీని సంతాన లక్ష్మీ కరుణిస్తున్నది. నిక్ జోనస్ సోదరుడు జూలై 2020లో తండ్రి అయ్యారు, నిక్ సోదరుడు కెవిన్ జోనస్ తన భార్య సీఫ టర్నర్ కూతురు జన్మనిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నిక్ జోనస్, ప్రియాంక దంపతుల సంతానంపై రకరకాల కథనాలు వినిపించాయి. ఓ దశలో ప్రియాంక చోప్రా గర్భం దాల్చిందనే వార్తలు, అలాగే నిక్ జోనస్‌తో విడిపోతున్నారనే వార్తలు మీడియాలో గందరగోళం సృష్టించాయి.
ఆడపిల్లకు జన్మనిచ్చిన ప్రియాంక చోప్రా
పిల్లలు ఎప్పుడు కంటున్నారని ప్రియాంక చోప్రాను మీడియా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో జనవరి 22వ తేదీన అందరికి ఆశ్చర్యం కలిగిస్తూ శుభవార్తను చెప్పింది. మాకు సరోగసి ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చాం అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దాంతో సినీ సెలబ్రిటీలు, అభిమానులు ప్రియాంక దంపతులకు శుభాకాంక్షలు అందించారు. కత్రినా కైఫ్, నేహా దూపియా, పూజా హెగ్డే లాంటి తారలు కంగ్రాట్స్ చెప్పారు.
12 వారాలకు ముందే బిడ్డ జననం
అయితే సంతానం కలిగిందనే సంతోషం ప్రియాంక చోప్రా దంపతులను ఎక్కువ సేపు ఉండనివ్వలేదు. ప్రియాంక చోప్రాకు పుట్టిన బిడ్డ నెలలు నిండకుండానే పుట్టింది. 12 వారాలకు ముందే ప్రియాంక దంపతులు సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. ఆరోగ్యం కుదటపడే వరకు చిన్నారిని హాస్పిటల్‌లోనే ఉంచుతారు. బహుశా ప్రియాంక బిడ్డ ఏప్రిల్ నెలలో ఇంటికి వచ్చే అవకాశం ఉంది. దాంతో ఏప్రిల్ నుంచి తన బిడ్డకు సమయం కేటాయించే విధంగా ప్రియాంక తన సమయాన్ని సర్దుబాటు చేసుకొంటున్నారు అని ప్రముఖ పత్రిక డైలీ మెయిల్ కథనాన్ని ప్రచురించింది.
రెండో బిడ్డను కనేందుకు ప్రియాంక ఉత్సాహం
ఆస్కార్ బరిలో ప్రియాంక చిత్రం
ఇక ప్రియాంక చోప్రా సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన మ్యాట్రిక్స్ రిసర్రెక్షన్స్ చిత్రం విడుదలై ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. ఇంకా జిమ్ స్ట్రాస్‌తో కలిసి టెక్ట్స్ ఫర్ యూ, జో, అంథోనితో కలిసి సిటాడెల్, లాగే ఆలియాభట్, కత్రినా కైఫ్‌తో కలిసి జీ లే జార చిత్రంలో నటిస్తున్నారు. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.
- Sidelines (May 14): Coaches polls, news and notes
- High school scores & schedules (May 20)
- Sidelines (May 21): Baseball and softball polls, news and notes
- Sri Lanka: Chinese Roulette in Paradise Isle
Priyanka Chopra కు నెలలు నిండకుండా పుట్టిన బిడ్డ.. ఇంకా హాస్పిటల్‌లో ఉండగానే.. రెండో బిడ్డ కోసం ప్లాన్! have 134 words, post on telugu.filmibeat.com at January 23, 2022. This is cached page on Movie News. If you want remove this page, please contact us.