ఎన్నో అనుమానాల నడుమ మొదలైనా.. అసలు ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకుల నుంచి స్పందనను అందుకుని.. చాలా తక్కువ సమయంలోనే నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పటికే ఐదింటిని దిగ్విజయంగా ప్రసారం చేసుకోవడంతో పాటు దేశంలోనే టాప్ రేటింగ్‌ను కూడా అందుకున్నారు. ఈ జోష్‌తోనే మరిన్ని ప్రయోగాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను మొదలు పెట్టబోతున్నారు. ఇందులోకి స్టార్ హీరో అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ రాబోతున్నాడట. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్? పూర్తి వివరాలేంటో చూద్దాం పదండి!
తెలుగులో సరికొత్త ప్రయోగానికి రెడీ
బిగ్ బాస్ ఐదో సీజన్ గత డిసెంబర్‌లోనే ముగిసింది. ఫినాలే స్టేజ్‌పైనే షో నిర్వహకులు త్వరలోనే ఓటీటీ సీజన్ వన్ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఆ తర్వాత దానికి హోస్టుగా అక్కినేని నాగార్జునే ఉంటాడని ఆయనే చెప్పారు. అంతేకాదు.. ఇందులో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని చెప్పారు. ఇలా నిర్వహకులు ఓటీటీ వెర్షన్‌పై అంచనాలను భారీగా పెంచేశారు.
ఊహించని ప్రశ్నతో అనసూయకు నెటిజన్ షాక్: మనిద్దరి మధ్య ఏం లేదంటూ యాంకర్ షాకింగ్ రిప్లై
ఆ ఓటీటీలో 24 గంటలూ ప్రసారమే
గత ఏడాది హిందీలో ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ ప్రసారం అయింది. అక్కడ దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. దీంతో ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ను తెలుగులోకి కూడా పరిచయం చేస్తున్నారు. దీన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్వహకులు వెల్లడించారు.
ఓటీటీ వెర్షన్.. తెర వెనుక జరిగేదిదే
అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌కు సంబంధించిన పనులన్నీ ఎప్పుడో మొదలయ్యాయి. ఇప్పటికే ఇందులో పాల్గనబోయే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ చివరికి వచ్చింది. అదే సమయంలో సెట్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. బిగ్ బాస్ ఐదో సీజన్ కోసం వాడిన సెట్‌లో కొన్ని కీలక మార్పులు చేసి.. కొత్త ఇంటిని నిర్మిస్తున్నారని సమాచారం.
హాట్ డోస్ మరింత పెంచేసిన పూజా హెగ్డే: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు
సీజన్ డేట్.. కంటెస్టెంట్లు.. రోజులు
బుల్లితెర వర్గాల్లో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతుందట. ఇది మొత్తం 82 రోజుల పాటు సాగనుందని తెలిసింది. ఇక, ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించిన షార్ట్ లిస్ట్ కూడా రెడీ అయిందని టాక్.
వాళ్లకు కూడా అవకాశం ఇస్తున్నారు
మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి కూడా చాలా రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక, ఇందులో ముగ్గురు నలుగురు మాజీ కంటెస్టెంట్లు పాల్గొనే అవకాశాలు ఉన్నాయని కొద్ది రోజుల క్రితమే ఓ న్యూస్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
హాట్ వీడియోలో రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: బాడీ పార్టులు మొత్తం చూపిస్తూ దారుణంగా!
షోలోకి అల్లు అర్జున్ ఫ్రెండ్ ఎంట్రీ
బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌కు సంబంధించి కంటెస్టెంట్ల ఎంపిక చాలా పకడ్బందీగా జరుగుతుందట. ఇందుకోసం సినిమా, సీరియల్ రంగాలకు చెందిన వాళ్లతో పాటు సోషల్ మీడియా సెలెబ్రిటీలను కూడా ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఇక, మాజీ కంటెస్టెంట్ల విభాగంలో అల్లు అర్జున్ ఫ్రెండ్, ప్రముఖ హీరో నవదీప్‌ను నిర్వహకులు సెలెక్ట్ చేశారని తాజాగా తెలిసింది.
రెండోసారి ఆఫర్ పట్టిన యంగ్ హీరో
- Moody’s upgrades rating of four banks in Vietnam
- Moody’s affirms ratings of eight Vietnamese banks
- Moody’s assigns first-time ratings to two Vietnam banks
- Moody’s revises Vietnam outlook as “positive”
Bigg Boss OTT: షోలోకి అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ ఎంట్రీ.. రెండోసారి ఆఫర్ పట్టేసిన టాలీవుడ్ హీరో have 143 words, post on telugu.filmibeat.com at January 20, 2022. This is cached page on Movie News. If you want remove this page, please contact us.