తెలుగు సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ ఎంతో ముఖ్యమైనది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పండుగ సమయంలో మూడు రోజులు సెలవులు ఉండడంతో పాటు పల్లెలు, పట్టణాలన్నీ జనాలతో కళకళలాడుతూ ఉంటాయి. అదే సమయంలో థియేటర్లు కూడా హౌస్‌ఫుల్ బోర్డులతో కనిపిస్తాయి. అందుకే ఆ సీజన్‌లో సినిమాలు ఎక్కువగా విడుదల అవుతుంటాయి.
అయితే, ఈ ఏడాది మాత్రం కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాలు వాయిదా పడిపోయాయి. దీంతో కొన్ని చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో భారీ సినిమాగా వచ్చిందే ‘బంగార్రాజు’. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా 11 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!
సంక్రాంతికి బంగార్రాజుల సందడి
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్‌లో కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన చిత్రమే 'బంగార్రాజు’. ఈ మూవీ 'సోగ్గాడే చిన్ని నాయన’కు సీక్వెల్‌గా వచ్చింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా జనవరి 14న విడుదల అయింది.
సినిమా ఛాన్స్ పట్టేసిన ప్రియాంక సింగ్: బడా రైటర్‌తో ముగిసిన చర్చలు.. న్యూస్ రాబోతుందంటూ!
బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్
సంక్రాంతికి భారీ చిత్రంగా వచ్చిన 'బంగార్రాజు’ హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్ల వ్యాపారం జరిగింది.
11వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు
'బంగార్రాజు’ మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 10వ రోజు కలెక్షన్లు భారీగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో రెండు రాష్ట్రాల్లో 11వ రోజు రూ. 36 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్ వచ్చింది.
ఓవర్ డోస్ హాట్ షోతో రెచ్చిపోయిన మలైకా: 48 ఏళ్ల వయసులో మరీ ఇంత ఘోరంగానా!
11 రోజులకూ కలిపి వచ్చింది ఎంత
11 రోజులకు కలిపి 'బంగార్రాజు’కు ఏపీ తెలంగాణలో కలెక్షన
ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఏపీ, తెలంగాణలో కలిపి 11 రోజులకు రూ. 32.75 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ రాణించింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.69 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.43 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 11 రోజుల్లోనే రూ. 35.87 కోట్లు షేర్‌తో పాటు రూ. 60.10 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.
జబర్ధస్త్ వర్షకు ఊహించని ఎదురుదెబ్బ: రక్తం కారుతూ ఆస్పత్రి బెడ్‌పై.. ఆ ముగ్గురి వల్లే అంటూ!
టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?
భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన 'బంగార్రాజు’ అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 11 రోజుల్లోనే రూ. 35.87 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 3.13 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.
- Atlanta Braves Top 100 Prospects: 81-90
- JAWS and the 2017 Hall of Fame ballot: One-and-done players, Part 1
- JAWS and the 2017 Hall of Fame ballot: Trevor Hoffman
- Toronto Blue Jays All Time 25 Man Roster
Bangarraju 11 Days Collections: బంగార్రాజుకు భారీ ఎదురుదెబ్బ.. 11 రోజుల్లో తొలిసారి ఇంత తక్కువగా! have 161 words, post on telugu.filmibeat.com at January 25, 2022. This is cached page on Movie News. If you want remove this page, please contact us.