నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంటున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూడవ చిత్రం అఖండ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. గత రెండు రోజుల నుంచి అభిమానులలో చాలా సందడి నెలకొంది. మొదటి రోజు ఉదయం నుంచే అఖండ ప్రీమియర్ షో లతో హడావిడి మొదలయ్యింది. అయితే సినిమా రిజల్ట్ పై ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అఖండ రిజల్ట్ పై సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
మహేష్ మద్దతు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీలో అందరితోనూ చాలా సన్నిహితంగా ఉంటారు అన
హీరోలు ఫుల్ హ్యాపీ
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవ్వగా ఉదయం నుంచే అభిమానుల హడావిడి తో ఇండస్ట్రీలో మంచి వాతావరణం నెలకొంది. చాలా రోజుల తర్వాత ఒక పెద్ద హీరో సినిమా చిత్ర పరిశ్రమలో హడావిడిగా కనిపించడంతో మిగతా సినీ ప్రముఖులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా థియేటర్స్ లలో పాత వెలుగులు నిండడంతో మిగతా హీరోలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
మహేష్ కూడా ఫుల్ హ్యాపీ
ఇక మహేష్ బాబు కూడా అఖండ స్టార్టింగ్ పై ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు. అఖండ మంచి ఆరంభాన్ని అందుకోవడం హ్యాపీ గా ఉంది అంటూ నందమూరి బాలకృష్ణ గారికి అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మహేష్ బాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు నిర్మాణం సంస్థ ద్వారక క్రియేషన్స్ కు కూడా విషెస్ ను అందించారు.
జై బాలయ్య.. ట్రేండింగ్
మహేష్ బాబు నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాపై పాజిటివ్ గా కామెంట్ చేయడంతో ఇరు వర్గాల అభిమానులలో చాలా మంచి వాతావరణం నెలకొంది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయింది. ఇక నేడు ఉదయం నుంచి బాలయ్య స్లోగన్ జై బాలయ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నందమూరి బాలకృష్ణ అఖండ ట్యాగ్స్ కూడా ట్రేండింగ్ లిస్టులో టాప్ లో ఉన్నాయి.
ఇలానే కొనసాగితే..
విదేశాల్లో కూడా జై బాలయ్య నినాదాలు గట్టిగానే వినిపిస్తున్నట్లు సోషల్ మీడియా లో హడావిడి చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక కొన్ని థియేటర్స్ లో అయితే జై బాలయ్య అంటూ నినాదాలు చేయడంతో థియేటర్స్ యాజమాన్యాలు కూడా కంగారుపడ్డాయి. మొత్తానికి చాలా కాలం తర్వాత సినిమా థియేటర్స్ చాలా కొత్తగా కనిపిస్తున్నాయి అనిపిస్తోంది. ఇలానే కొనసాగితే జనవరిలో వచ్చే RRR బ్కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుంది అని చెప్పవచ్చు.
- RUNNING: Helpston duo dominate Bourne race after taking top two spots
- Cambridge Half Marathon 2019: The top 100 men and women
- Dewsbury 10K road race results
అఖండ రిజల్ట్ పై మహేష్ బాబు రియాక్షన్.. చాలా హ్యాపీ అంటూ.. have 115 words, post on telugu.filmibeat.com at December 2, 2021. This is cached page on Movie News. If you want remove this page, please contact us.