అమాయక చూపులు, చిరు నవ్వు, నాజూకైన అందంతో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ గత కొంత కాలంగా వెండి తెరకు దూరమైంది. మీరా జాస్మిన్ మీరా జాస్మిన్ కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. చాలా కాలం పాటు మీరా టాప్ హీరోయిన్ల లీగ్ లో కొనసాగింది. 2016 నుంచి వెండి తెరపై కనిపించడం లేదు. మీరా జాస్మిన్ 2014లో అనిల్ జాన్ అనే ఇంజనీర్ ని వివాహం చేసుకుని దుబాయ్ లో సెటిల్ అయింది.
గత ఏడాది మీరా జాస్మిన్ చెన్నైలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైంది. ఆ సమయంలో మీరా జాస్మిన్ బాగా బరువు పెరిగి కనిపించింది. వివాహం అయ్యాక మీరా జాస్మిన్ ఇలా అయిపోయిందేంటి అని అంతా అనుకున్నారు. తాజాగా మీరా జాస్మిన్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా మీరా జాస్మిన్ మునుపటిలా నాజూకైన లుక్ లోకి మారిపోయింది.
మీరా జాస్మిన్ సినిమాల్లో రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. మీరా జాస్మిన్ తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, గోరింటాకు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సీనియర్ హీరోయిన్లంతా అక్కగా, వదినగా, అత్తగా నటిస్తూ దూసుకుపోతున్నారు. మీరా జాస్మిన్ కు ఎలాంటి పాత్రలు దక్కుతాయో చూడాలి.
- The Bollinger B1 and B2 have Tonka looks with Tesla power
- Vizio M-Series (M65-E0) review
- Have These 7 Vitamins For Helping You Grow Taller
- Nuclear power in the UK – a history
మీరా జాస్మిన్ లేటెస్ట్ లుక్.. వైరల్ అవుతున్న పిక్స్! have 102 words, post on telugu.filmibeat.com at May 1, 2019. This is cached page on Movie News. If you want remove this page, please contact us.